శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (10:11 IST)

నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య

తెలంగాణా రాష్ట్రంలోని నర్సంపేట పట్టణంలో ఓ ఆర్టీసీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన ఎండీ ఇమ్రాన్ అనే వ్యక్తి నర్సంపేట డిపోలో ఆర్టీసీ బస్సు కండక్టరుగా పనిచేస్తున్నాడు. ఈయన పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద ఉన్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఎంబీఏ పూర్తి చేసిన ఆయన కొన్నేళ్ళ క్రితం కారుణ్య నియామకం కింద నర్సంపేట డిపోలో ఆర్టీసీ బస్సు కండక్టరుగా విధుల్లో చేరాడు. ప్రస్తుతం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అకౌటెంట్‌ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇమ్రాన్ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియజేయాల్సివుంది.