నేటి నుండి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం

tsrtc buses
వి| Last Modified సోమవారం, 2 నవంబరు 2020 (15:12 IST)
లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో కడప, కర్నూలు, చిత్తూరు, రాజ మండ్రి, విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు వెళ్లే బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య
ఒప్పందంపై సంతకం జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.61 లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దపడిన విషయం తెలిసిందే.

ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని తెలిపారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు సమాచారాన్ని పంపించామని అన్నారు. బస్సులు నడవడం ప్రారంభం అయిన వెంటనే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.దీనిపై మరింత చదవండి :