శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (16:16 IST)

మాల్దీవుల్లో విహారయాత్రకు సైనా-కశ్యప్ జోడీ.. ఫోటోలు నెట్టింట వైరల్

Saina nehwal_Kashyap
భారత షట్లర్లు, హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌ దంపతులు మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. బ్యాడ్మింటన్‌ నుంచి విరామం తీసుకున్న సైనా, కశ్యప్‌ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వీరితో పాటు మరో స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌ అతని భార్య కూడా మాల్దీవులకు వెళ్లారు. 
 
సైనా, కశ్యప్‌ దంపతులు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సరదాగా విహరిస్తున్న ఫోటోలను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటూ క్యాప్షన్‌ జోడించింది. సముద్రతీరంలో ఓషియన్‌ డిన్నర్‌ చేస్తున్నామని సైనా పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.