శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (14:04 IST)

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లు రీషెడ్యూల్‌ అయ్యాయి. రైల్వే అధికారులు మాట్లాడుతూ... హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయన్నారు.

కొన్నిటిని దారి మళ్లించినట్టు తెలిపారు. యశ్వంత్‌పూర్‌-హౌరా రైలును రద్దు చేశామన్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.

దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్‌-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు న్యూ కూచ్‌ బెహర్‌, మాతాభాంగ్‌, టీస్తా, రాణినగర్‌ మీదుగా నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.