మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:01 IST)

పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. రూ.37లక్షలు గుంజేశాడు.. ఆపై పరార్

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఓ యువకుడు. అంతే కాకుండా సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37లక్షలు గుంజేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన మహిళ (26) రెండేళ్ల క్రితం విప్రో సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ టీం లీడర్‌గా పని చేస్తున్న మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన జై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
 
ఈ క్రమంలో సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆయువతి వద్దనుంచి జై రూ.37 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 3న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
బాధిత యువతి కేసు పెట్టిందని తెలుసుకున్న జై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. జై కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.