రెడ్డా.. మజాకా : ములాఖత్‌లతో సెటిల్‌మెంట్లు చేస్తున్న మాజీ ఏఎస్ఐ

శుక్రవారం, 17 నవంబరు 2017 (11:31 IST)

mohan reddy

అక్రమదందాకు కేరాఫ్ అడ్రస్‌ మోహన్ రెడ్డి. సస్పెన్షన్‌కు గురైన ఏఎస్ఐ. కేవలం ఏడేళ్ళ సర్వీసులోనే కోట్లాది రూపాయల అక్రమాస్తులకు పడగలెత్తారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టై కరీంనగర్ జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అదీ కూడా దర్జాగా.. రాజభోగాలు అనుభవిస్తూ శిక్షను అనుభవిస్తున్నాడు. 
 
అంతేనా, దందాలను జైల్లోనూ అలాగే కొనసాగిస్తున్నాడు. ములాఖత్‌లలోనే సెటిల్మెంట్లు చేస్తున్నాడు. జైల్లో ఉన్న ఖైదీలను నేరుగా కలిసేందుకు సాధారణంగా ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు. కానీ.. మోహన్ రెడ్డిని మాత్రం జైలు సూపరింటెండెంట్ గదిలో కూర్చోబెట్టి ములాఖత్‌లు జరిపిస్తున్నారు. 
 
కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆఫీసులో తన కుటుంబసభ్యులతో ములాఖత్ అయ్యాడు మోహన్ రెడ్డి. వారితో చాలాసేపు మాట్లాడాడు. సెటిల్మెంట్లు, వ్యాపారాలపై ముచ్చటించాడు. మోహన్ రెడ్డి దర్జాలను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియో బయటకు రావడంతో… మోహన్ రెడ్డి రాజభోగాలే కాదు.. జైలు అధికారుల నిర్లక్ష్యం కూడా బయటపడింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జార్జిబుష్ అసభ్యంగా ప్రవర్తించారు...

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బయటికొచ్చిన ...

news

శశికళ చేసిన పనికే.. ఐటీ రైడ్లు.. పెరోల్‌లో బయటికి వచ్చి?

అక్రమాస్తుల కేసులో చిప్పకూడు తింటున్న చిన్నమ్మ శశికళ ఈమధ్య భర్తకు బాగోలేదని పెరోల్‌పై ...

news

బిర్యానీ వండటం చేతకాదని.. భార్యను పుట్టింటికి పంపించాడు

బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. ...

news

వాణి విశ్వనాథ్ నాకు పోటీనా? నాకు హోం మంత్రి పదవి ఇస్తే చేస్తా: రోజా

సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ తనకు పోటీనా.. తాను అలా అనుకోవట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...