శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (13:22 IST)

ప్రాణహిత నదిలో శవాలుగా తేలిన తల్లీకుమార్తె.. బావిలో తండ్రి మృతదేహం

తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీమ్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో తల్లీ కుమార్తెలు కలిసి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మాత్రం బావిలో దూకి చనిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బూరపెల్లికి భార్యాభర్తలు తమ కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. వీరిలో తల్లీ కుమార్తె శుక్రవారం ఉదయం ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
భార్య, కూతురి మృతి వార్త విన్న భర్త… అది జీర్ణించుకోలేక ఇంటివద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.