గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (09:47 IST)

ప్రజలకు షాకివ్వనున్న తెలంగాణ సర్కారు.. మరోమారు చార్జీల బాదుడు

తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తేరుకోలేని షాకివ్వనుంది. ఇప్పటికే ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను మరోమారు భారీగా పెంచాలని భావిస్తోంది. రూ.4,500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఈ పెంపునకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. 
 
ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా 50 శాతం మేరకు పెంచాలన్న సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, ఆటస్థలాల విలువను 35 శాతం, బహుళ అంతస్తు భవన సముదాయం విలువ 25 శాతం పెంచే దిశగా కసరత్తులు చేస్తుంది. అన్నీ అనుకూలిస్తే ఈ కొత్త బాదుడు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరం భూమి దాదాపు రూ.30 లక్షల వరకు పలుకుతుంది. ఇపుడు దీన్ని 50 శాతం మేరకు పెంచితే అంటే రూ.60 లక్షలకు పైగా పలికే అవకాశం ఉంది.