శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (08:48 IST)

టీఆరెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

టీఆర్‌ఎస్ అధిష్ఠానం తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు.

మరో అభ్యర్థిగా మాజీ స్పీకర్, సీనియర్ నేత కే.ఆర్. సురేశ్ రెడ్డి అనూహ్యంగా తెరపైకి రావడం గమనించాల్సిన అంశం. శుక్రవారం వీరిద్దరూ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

అయితే సురేశ్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై  పార్టీలో చర్చ మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో నిజామాబాద్ కీలక నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలోనే  సురేశ్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేకే విషయంలో ఊగిసలాటలో ఉన్న అధిష్ఠానం చివరకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.