మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆ రెండు రోజుల్లో ఒంటి గంట వరకు?
మందుబాబులకు కిక్కించే వార్త ఇది. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు. ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే. ఈ సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్ప
మందుబాబులకు కిక్కించే వార్త ఇది. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు. ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే. ఈ సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాత్రి 12 గంటలకు మాత్రమే బార్లకు అనుమతి వుండేది. తాజాగా గంట అదనంగా పొడిగించారు. కానీ ఈ గంట పొడిగింపు వారం మొత్తం కాదు. కేవలం శుక్ర, శని వారాల్లో మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పొడగింపు నిబంధన హీహెచ్‌ఎంసీతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకే వర్తిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అన్ని వర్కింగ్ డేస్‌లో బార్లను ఉదయం 10 గంటల నుంచి… రాత్రి 12 గంటల వరకు ఉంచే అవకాశం ఉంది.
వీకెండ్ రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో గంట టైం అదనంగా పెంచాలంటూ బార్ల యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు.. వారంలో రెండు రోజుల పాటు అదనంగా మరో గంట పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. కొత్త నిర్ణయంతో వీకెండ్‌లో మధ్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని సర్కార్ భావిస్తోంది.