Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కలెక్టర్ ఆమ్రపాలి ఎందుకలా చేశారు? కారు జప్తు వరకూ పరిస్థితి ఎందుకొచ్చింది?

శనివారం, 20 జనవరి 2018 (18:51 IST)

Widgets Magazine
Amrapali

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వార్తల్లో నిలుస్తుంటారు. ఐతే ఆమె వరంగల్ జిల్లా ప్రజలతో మమేకమవుతూ, వారి కోసం అహర్నిశలు కష్టపడుతూ వార్తల్లో నిలిస్తుండేవారు. కానీ ఈసారి అనూహ్యంగా మరో వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. విషయం ఏంటయా అంటే... తన భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయం కోసం వాడుకుంటూ గత రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని ఇంటి యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
తనకు చెల్లించాల్సిన అద్దె 2014 నాటికి రూ. 3,30,958 చెల్లించాల్సి వుందనీ, ఈ విషయాన్ని ఎన్నిసార్లు కలెక్టర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించారు. ఇంటి యజమాని వాదనలు విన్న కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ఆమ్రపాలి ఇలా పట్టించుకోకుండా ఇంటి యజమానిని ఇబ్బందులకు గురి చేయడంపై మండిపడుతూ... ఐసీడీఎస్‌ కార్యాలయం ఉన్న ప్రైవేట్ భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్‌ వాహనాన్ని సీజ్‌ చేయాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శనివారం ఆదేశాలు జారీ చేశారు. 
 
కలెక్టర్ అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని స్పష్టం చేశారు. దీనితో సిబ్బంది ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయడానికి కలెక్టరేట్ చేరుకున్నారు. కానీ డబ్బు చెల్లించేందుకు తనకు వారం రోజులు సమయం ఇవ్వాలని ఆమె కోరడంతో వారు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విద్యార్థిని మందలించింది.. తుపాకీతో ప్రిన్సిపాల్‌ను కాల్చేశాడు..

విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో ...

news

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్: హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములను..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కష్టాల్లో పడింది. నిర్ణీత కాల వ్యవధిలో ద్రవ్య ...

news

డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటే అసలు బరువెంతో తెలుసుకుని?

మైఖెల్‌ ఊల్ఫ్‌ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ జీవితాధారంగా ఫైర్‌ అండ్‌ ప్యూరీ అనే పుస్తకం ...

news

శాడిస్ట్ శైలజా? రాజేష్‌ కాదా? కేసు విచారణలో తలలుపట్టుకుంటున్న పోలీసులు(Video)

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవ వధువు శైలజ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇంతకాలం శైలజ ...

Widgets Magazine