తొమ్మిది నెలల పాప హత్య కేసులో సుప్రీంకోర్టుకు వరంగల్‌ పోలీసులు

suprem court
శ్రీ| Last Modified సోమవారం, 9 డిశెంబరు 2019 (21:54 IST)
తొమ్మిది నెలల పాపను హతమార్చిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి. రవీందర్‌ సోమవారం ప్రకటించారు.


హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తొమ్మిది నెలల చిన్నారిపై ఆత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు మరణశిక్షను విధిస్తూ గతంలో కోర్టు తీర్పును వెలుబడించడం జరిగింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖల కావడంతో వరంగల్‌ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణ శిక్ష తీర్పుపై పూర్వపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తు ఈ తీర్పుపై వరంగల్‌ కమీషనరేట్‌ పోలీసులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :