మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (18:28 IST)

పెట్రోల్ బంకులో వింత.. డీజిల్ స్థానంలో నీళ్లు

petrol
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చమురు ధరలు సెంచరీ కొట్టాయి. ఇలా పెరిగిపోయిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు, పెట్రోల్ బంకు యజమానులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనదారులను మోసం చేస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌‍లో కల్తీకి పాల్పడుతూ మోసం చేస్తున్నారు. ఇపుడు అంతకుమించిన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట హుజూర్ నగర్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి తన వాహనానికి డీజిల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంకుకు వెళ్లాడు. డీజిల్ కొట్టిస్తున్న సమయంలో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తున్న సమయంలో ఆవిరి వస్తుంది. కానీ, ఇక్కడ అలాంటిదేమీ రాకపోవడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తి తన వాహనాన్ని పక్కనబెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందులో డీజిల్ నింపాలని కోరాడు. దీనికి పెట్రోల్ బంక్ సిబ్బంది ససేమిరా అన్నారు. 
 
కానీ, ఆ వాహనదారుడు మాత్రం పట్టు విడవకపోవడంతో సిబ్బంది మరో మార్గం లేక ఆ బాటిల్‌లో డీజిల్ నింపగా, కేవలం మంచినీరు మాత్రమే వచ్చింది. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది చేస్తున్న అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సిబ్బందిని నిదీయడంతో వారు వింతగా సమాధానం చెప్పారు. అది మంచినీరు కాదని, డీజల్ రంగు మారిందని చెప్పాడు. ఇప్పటికే అనేక వాహనాలకు ఈ డీజిల్‌ను నింపినట్టు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.