శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (13:46 IST)

భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త

భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మూడు రోజులు ఇంట్లోని సంపులో భార్య మృతదేహాన్ని దాచి శవాన్ని మాయం చేసేందుకు విఫలయత్నం చేసి దొరికిపోయాడు. వివరాలు పరిశీలిస్తే షాజియాబేగం మియాపూర్ సమీపంలోని హఫీజ్ పేట్‌కు చెందిన తాజ్‌తో ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. 
 
ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు సంతానం కలిగారు. వీరికి ఆరేళ్ల తహ, నాలుగేళ్ల తల్హా, రెండేళ్ల ఇబ్రహీంలు ఉన్నారు. ఇటీవల కాలంలో కాపురంలో కలతలు బయలేగాయి... భర్త తాజ్, అత్తింటివారంతా షాజియాను వేధింపులకు గురిచేసినా ఏనాడూ పుట్టింటివారికి చెప్పుకునేది కాదు ఈ ఇల్లాలు. శారీరకంగా, మానసికంగా హింసించినా ఓర్పుతో అన్నీ భరించింది షాజియా. 
 
మూడ్రోజుల క్రితం షాజియాబేగంపై కత్తులతో దాడి చేసి.. ఆమెని చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశారని ఆరోపిస్తున్నారు హతురాలి బంధువులు.నీళ్ల సంపులో ఉన్న షాజియాబేగం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. షాజియా బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాజియాది హత్యా.. లేక ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడి చనిపోయిందా అనేది వైద్యులిచ్చే పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని చెప్తున్నారు పోలీసులు.