Widgets Magazine

పక్కింటి కుర్రాడే కదా అని నమ్మింది... పబ్‌లు అలవాటు చేసి లేపుకెళ్ళిపోయాడు...?

జల్సాలకు అలవాటుపడితే ఎలాంటి అనర్థం జరుగుతుందో ఇది చదివితే అర్థమవుతుంది. పచ్చటి సంసారంలో చిచ్చు రేగడానికి ఆ కుటుంబంలో జల్సాలే కారణమైంది. చివరకు భర్తతో విడిపోయి ప్రియుడితో పారిపోవడానికి కారణమైంది..

lovers romance
TJ| Last Modified శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:18 IST)
జల్సాలకు అలవాటుపడితే ఎలాంటి అనర్థం జరుగుతుందో ఇది చదివితే అర్థమవుతుంది. పచ్చటి సంసారంలో చిచ్చు రేగడానికి ఆ కుటుంబంలో జల్సాలే కారణమైంది. చివరకు భర్తతో విడిపోయి ప్రియుడితో పారిపోవడానికి కారణమైంది.
 
నిజామాబాద్‌కు చెందిన పద్మ డిగ్రీ చదివింది. తల్లిదండ్రులు భాస్కర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. భాస్కర్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం వీరికి వివాహమైంది. ఆ తరువాత భార్యను హైదరాబాదుకు తీసుకొచ్చి ఒక అపార్టుమెంటులో కాపురం పెట్టాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నడుపుకొస్తున్నాడు భాస్కర్. అయితే తన ఫ్లాట్ పక్కనే పవన్ అనే బ్యాచిలర్ ఉండేవాడు. 
 
పద్మపై కన్నేశాడు పవన్. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. పబ్‌లు, సినిమాలు, కొత్త సెల్‌ఫోన్లు ఇలా జల్సాలను ఆమెకు రుచి చూపించడం ప్రారంభించాడు. అందమైన లైఫ్ చూసిన పద్మ పవన్ వలలో ఈజీగా పడిపోయింది. ఇలా ఆమెను లొంగదీసుకుని రెండు నెలల వరకు ఆమెతో గడిపాడు. తన భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది పద్మ.
 
జల్సాలకు బాగా అలవాటుపడిన పద్మకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు పవన్. తనకు ఈ జీవితం ఇష్టం లేదని, పవన్‌తో వెళ్ళిపోతున్నట్లు ఒక లేఖ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది పద్మ. దీంతో భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు.
 
హైదరాబాద్ లోని ఉప్పలో ఒక హాస్టల్‌లో పద్మను ఉంచిన పవన్ దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ ప్రతిరోజు కలిసేవారు. మొదట్లో తన వద్ద ఉన్న డబ్బును బాగా ఖర్చు పెట్టి ఆమెను కొన్నిరోజుల పాటు నమ్మించాడు. ఆ తరువాత ఆమెకు అసలు విషయాన్ని చెప్పాడు పవన్. 
 
తాను ఒక చైన్ స్కాచర్ అని. దీంతో ఆ మహిళ భయపడిపోయింది. ఒక చైన్ స్కాచర్‌తోనా తాను వచ్చేసిందని భయపడింది. డబ్బులు సంపాదించి జల్సాలు చేసుకోవాలంటే తనతో పాటు చైన్ స్కాచింగ్ చేయాలని చెప్పాడు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. 
 
చివరకు ఆలోచించి జల్సాల కోసం దొంగతనాలను ప్రారంభించింది. తన హాస్టల్‌లో చైన్లు, ఉంగరాలను దొంగతనం చేయడం ప్రారంభించింది. ఆ తరువాత మెల్లగా పవన్‌తో కలిసి చైన్ స్కాచింగ్‌లు చేసింది. కొన్నిరోజులు బాగానే గడిచాయి. ఆ తరువాత పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పద్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్‌ను కూడా అరెస్టు చేశారు. ఇప్పుడు పద్మ జైలులో ఊచలు లెక్కిస్తోంది.


దీనిపై మరింత చదవండి :