మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (19:33 IST)

చిన్న దొరా! 10 కుటుంబాలను ఒక డబుల్ బెడ్రూం ఇంట్లోనే కాపురం ఉండమని చెప్పకపోయారా?: వైఎస్ షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇందిరమ్మ ఇళ్లతో సమానం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్పందించారు.

మీరు ఇచ్చే ఒక డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇళ్లలో సమానమా? మరి 10 కుటుంబాలను ఒక డబుల్ బెడ్రూం ఇంట్లోనే కాపురం ఉండమని చెప్పకపోయారా చిన్న దొరా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
 
"కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడం మీకు చేతకాదు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం మీకు చేతకాదు. ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వడం చేతకాదు. మీకు రుణమాఫీ చెయ్యడం చేతకాదు.

మీకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం చేతకాదు. మీకు వరి ధాన్యం కొనడం చేతకాదు కదా. పాలన మానేసి ధర్నాలే చేసుకోండి... రాజీనామా చేసి ఒక దళితుడిని సీఎం చేయండి" అంటూ షర్మిల్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.