అనుష్క పెళ్లిపై జోరుగా కథనాలు.. ఉత్తుత్తిదేనన్న మేనేజర్!

anushka
PNR| Last Updated: గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:26 IST)
టాలీవుడ్ అందాల తార అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మేల్కొన్న ఆమె మేనేజర్ ఆ వార్తలను ఖండించాడు. పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊపుర్లేనని అనుష్క మేనేజర్ స్పష్టం చేశాడు.

ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం అనంతరం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అనుష్క మేనేజర్ పైవిధంగా స్పందించాడు. 'బహుబలి' చిత్రం అనంతరం అనుష్క తెలుగులో 'బాగమతి' అనే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి ఆమె గతంలోనే సైన్ చేసినట్లు మేనేజనర్ తెలిపాడు.

ప్రస్తుతం
తమిళంలో రజనీకాంత్ 'లింగా' షూటింగ్తో బిజీగా ఉందన్నందున అనుష్క... కొత్త చిత్రాలను అంగీకరించలేదని పేర్కొన్నాడు. మరోవైపు అజిత్ సినిమాలో నటిస్తున్నదని, అవన్నీ పూర్తి అయ్యేవరకూ కొత్త చిత్రాలు అంగీకరించటం లేదని ఆయన స్పష్టం చేశాడు.దీనిపై మరింత చదవండి :