బన్నీ సన్ రికార్డ్ అదుర్స్: అప్పుడే ఏకంగా లక్ష లైకులు..!

Selvi| Last Updated: గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:02 IST)
అల్లు అర్జున్ తనయుడు అయాన్ రికార్డ్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. తాజాగా బన్నీ తన తనయుడి లేటెస్ట్ ఫోటోలను ఫేస్ బుక్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు. ఆ వెంటనే అభిమానులు వాటిని లైక్ చేయడం మొదలెట్టారు. అంతా ఇంతా కాదు ... ఏకంగా లక్ష లైకులు వచ్చి పడ్డాయి.

మామూలుగా సినిమా సెలెబ్రిటీల పట్ల అభిమానుల్లో ఆదరణ బాగా వుంటుంది. అయితే, వారి పిల్లల పట్ల కూడా ఇంతటి క్రేజ్ ఉంటుందా? అన్నది ఈ ఫోటోలకు లభిస్తున్న 'లైక్స్'ను బట్టి వెల్లడవుతోంది. అన్నట్టు, చిన్నారి అయాన్ ఈ ఫోటోలలో ముద్దుముద్దుగా నవ్వులు చిందిస్తున్నాడు!దీనిపై మరింత చదవండి :