ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (13:50 IST)

నిర్మాతగా మారనున్న టాలీవుడ్ హీరోయిన్..?

శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా అవకాశాలతో దూసుకెళుతోంది. కథా కథనం ఉన్న సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ ఇప్పుడు చేతులు సినిమాలు లేక ఇబ్బందులు పడు

శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా అవకాశాలతో దూసుకెళుతోంది. కథా కథనం ఉన్న సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ ఇప్పుడు చేతులు సినిమాలు లేక ఇబ్బందులు పడుతోంది. 'జై లవ కుశ'లో ఐటం గాళ్‌గా నటించిన తమన్నా ఇప్పుడు అది కూడా లేకుండా ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయింది.
 
దీంతో డబ్బులు ఎలాగైనా సంపాదించాలన్న ఉద్దేశంతో తమన్నా నిర్మాతగా మారిపోవాలన్న నిర్ణయానికి వచ్చేసింది. త్వరలో మంచి రచయితను కలిసి కథను సిద్ధం చేసుకుని సొంతంగా సినిమా చేయాలన్న ఆలోచనలో ఉంది. 
 
అంతేకాదు ఎవరైనా మంచి దర్శకుడు దొరికితే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించేసిందట ఈ మిల్కీ బ్యూటీ. మరి తమన్నా నిర్మాతగా మారిన తర్వాత ఎవరితో సినిమాలు చేస్తుందో.. అక్కడ ఆమెకు విజయాలు చేకూరుతాయో లేదో వేచి చూడాల్సిందే.