శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:37 IST)

" లేడీ ఓపెన్‌హైమర్" ట్రోల్స్‌పై అమీ జాక్సన్ ఫైర్..

Amy Jackson
Amy Jackson
" లేడీ ఓపెన్‌హైమర్" ట్రోల్స్‌పై బ్రిటీష్ నటి అమీ జాక్సన్ స్పందించింది. అమీ జాక్సన్ ఇటీవల చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైంది. అమీ కొత్త లుక్, సిలియన్ మర్ఫీగా 'లేడీ ఓపెన్‌హైమర్' అని పిలిచేలా చేసింది.
 
సాధారణంగా, ఫిల్మ్ సెలబ్రిటీలు తమ ఫ్యాషన్ లుక్స్‌పై వస్తున్న ఈ ట్రోల్స్‌ను పట్టించుకోరు. కానీ అమీ జాక్సన్ ట్రోలర్స్‌కు తాజా ఫోటోలపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకుంది. 
 
భారతీయ నెటిజన్ల నుంచి ఆన్‌లైన్ ఆగ్రహం చాలా విచారకరం. ఒక స్త్రీ తన అందంగా లేని ఫోటోను షేర్ చేస్తే ఇలా స్పందిస్తారా అంటూ ప్రశ్నించింది. 
 
ఆమెను సిలియన్ మర్ఫీతో పోల్చడంపై స్పందిస్తూ, ఆమె సరదాగా మాట్లాడింది. ఇలాంటి ట్రోల్స్ మైండ్‌లోకి తీసుకునే మూడ్‌లో లేనట్లు తెలిపింది. అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్‌లా అమీ జాక్సన్ లుక్ వున్న ఫోటోలను ఆమె నెట్టింట షేర్ చేసింది. 
 
ఈ ఫోటోలలో ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. పేలవంగా కనిపించింది. ఈ ఫోటోలపై అప్పుడే నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.