మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (12:33 IST)

దర్శకుడిని దోసె పెనంతో కొట్టిన అంజలి... ఎందుకు?

రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి నటిస్తున్న తాజా చిత్రం ''లీసా''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇంతలో అంజలికి ఏమైందో ఏమో కానీ దోసె పాన్‌ను దర్శకు

రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి నటిస్తున్న తాజా చిత్రం ''లీసా''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇంతలో అంజలికి ఏమైందో ఏమో కానీ దోసె పాన్‌ను దర్శకుడి మొహాన కొట్టింది. దీంతో డైరక్టర్‌కు గాయం తగిలింది. పీజీ ముత్తయ్య సమర్పించే ఈ సినిమా త్రీడీ టెక్నాలజీ స్టీరియో స్కోప్ అనే కొత్త సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతోంది. 
 
ఈ టెక్నాలజీతో తయారయ్యే తొలి భారతీయ సినిమా లీసా కావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా, అంజలి దోసె పెనాన్ని కెమెరాపైకి విసరాలి. కానీ అంజలి విసిరిన దోసె పెనం నేరుగా దర్శకుడు రాజు విశ్వనాథ్ తలకు తగిలింది. దీంతో విశ్వనాథ్ తలకు గాయమైంది. ఆపై దర్శకుడిని ఆస్పత్రికి తరలించి కనుబొమ్మల వద్ద కుట్లేసినట్లు తెలిసింది. దీంతో ఒక రోజు పాటు షూటింగ్ ఆగిపోయింది.