మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:31 IST)

అనుష్కకు నిశ్శబ్దం నిర్మాతతో గొడవలా..? అసలు ఏమైంది..?

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఇందులో అనుష్క‌ శెట్టి, ఆర్‌.మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే ప్ర‌ధాన పాత్రలు పోషించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ సినిమా రూపొందింది. ఈ భారీ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ సినిమాలో హాలీవుడ్‌కి చెందిన న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత, ఫొటోగ్రాఫ‌ర్ మైకేల్ మ్యాడ్‌స‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి స‌హా ప‌లువురు ఇండియ‌న్స్ యాక్ట‌ర్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్ మ్యాడ్‌స‌న్ తదితర స్టార్స్ న‌టించిన ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందించగా, షానియ‌ల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసారు. 
 
ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన రావడంతో నిశ్శబ్దం సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. థియేటర్స్ మూసేయడం వలన రిలీజ్ వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. 
 
అయితే.. నిశ్శబ్ధం సినిమాని ఆన్ లైన్లో రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్స్ అంటుంటే.. అనుష్క నో చెబుతుందని.. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ పైన ఫైర్ అవుతుందని వార్తలు రావడం తెలిసిందే. 
 
ఎందుకంటే.. తన సినిమా థియేటర్లో కాకుండా ఇలా ఆన్లైన్లో రిలీజ్ చేస్తే.. క్రేజ్ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో నో చెబుతుందని.. అందుచేత ప్రొడ్యూసర్స్‌తో అనుష్కకు గొడవలు అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తలను నిశ్శబ్ధం నిర్మాతలు ఖండించారు. మరి... నిశ్శబ్దం రిలీజ్ ఎప్పుడు అవుతుందో చూడాలి.