శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (11:15 IST)

''అర్జున్ రెడ్డి''తో రొమాన్స్ చేయనున్న మెహ్రీన్..?

అర్జున్ రెడ్డి తాజా సినిమాలో అందాల రాశి మెహ్రీన్ నటించనుంది. తెలుగు తెరపై గ్లామర్ పంట పండిస్తున్న హీరోయిన్లలో మెహ్రీన్ కూడా ఒకరు. ఈమెకు టాలీవుడ్‌ ఫ్యాన్స్ మధ్య మంచి క్రేజ్ లభిస్తోంది. ''రాజా ది గ్రేట్

అర్జున్ రెడ్డి తాజా సినిమాలో అందాల రాశి మెహ్రీన్ నటించనుంది. తెలుగు తెరపై గ్లామర్ పంట పండిస్తున్న హీరోయిన్లలో మెహ్రీన్ కూడా ఒకరు. ఈమెకు టాలీవుడ్‌ ఫ్యాన్స్ మధ్య మంచి క్రేజ్ లభిస్తోంది. ''రాజా ది గ్రేట్'' సినిమా తర్వాత ఈ సుందరికి అవకాశాలు రాలేదని వార్తలొచ్చాయి. అయితే యూత్ మధ్య మంచి ఫాలోయింగ్ వున్న అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ నటించే తమిళ సినిమాలో అవకాశాన్ని చేజిక్కించుకుంది.
 
తెలుగు ప్రేక్షకుల ముందుకు అర్జున్ రెడ్డి తర్వాత టాక్సీ వాలా, ఏ మంత్రం వేశావే సినిమాలతో రానున్న విజయ్ దేవరకొండ.. తమిళలంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పాత్ర పరంగా విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ అయితే బాగుంటుందని భావించి ఎంపిక చేసినట్లు తెలిసింది.