బిగ్‌ బాస్-3కి హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్

chiranjeevi
Last Updated: శనివారం, 5 జనవరి 2019 (14:49 IST)
''మీలో ఎవరు కోటీశ్వరుడు'' వ్యాఖ్యాతగా వ్యవహరించిన మెగాస్టార్ చిరంజీవి.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. స్టార్ మా ఛానల్‌‍లో ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్-3కి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 3కి వెంకీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని టాక్ వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి పేరు వినిపిస్తోంది.
 
బిగ్ బాస్-2కి హోస్ట్‌గా వ్యవహరించే సమయంలో నాని కొన్ని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో నాని బిగ్ బాస్-3కి దూరమయ్యాడు. తర్వాత మా నిర్వాహకులు వెంకీని సంప్రదించారు. ఆయన కూడా బిగ్ బాస్‌-3కి హోస్ట్‌గా వుండబోనని చెప్పేశాడని సమాచారం. తాజాగా చిరంజీవిని మా టీవీ నిర్వాహకులు సంప్రదించారని సమాచారం. ఇంకా ఆయన్ని ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చిరంజీవి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలిదీనిపై మరింత చదవండి :