శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:53 IST)

బోయపాటికి హీరోలు లేరు, ఆ హీరో ఓకే చెబుతాడా..?

ఊర మాస్ డైరెక్టర్ అంటే ఠక్కున చెప్పే పేరు బోయపాటి శ్రీను. ఈ ఊర మాస్ డైరెక్టర్ ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. అయితే.. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే బోయపాటి నెక్ట్స్ మూవీ ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బోయపాటి తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే... చిరంజీవితో బోయపాటి సినిమా అని దీనిని దిల్ రాజు నిర్మాత అని వార్తలు వస్తున్నాయి.
 
కానీ చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పట్లో చిరు డేట్స్ దొరకవు. అందుచేత బోయపాటి హీరో కోసం సెర్చ్ చేస్తున్నాడట. రామ్ చరణ్‌కి ఇప్పుడు ఓ డైరెక్టర్ కావాలి కానీ.. వినయ విధేయ రామ డిజాస్టర్ కావడంతో బోయపాటితో చరణ్ ఇప్పట్లో సినిమా చేయడు. మహేష్ బాబుతో బోయపాటి సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ఆయనతో సినిమా తనకి సెట్ కాదని పక్కనపెట్టాడు. ఎన్టీఆర్‌తో బోయపాటి దమ్ము సినిమా చేసాడు. ఇప్పట్లో బోయపాటితో సినిమా చేసే దమ్ము ఎన్టీఆర్‌కు ఉండదు.
 
ఇలా... ఏ హీరో కూడా బోయపాటితో సినిమా చేయడానికి రెడీగా లేరు. అయితే.. ఒకే ఒక్క హీరో ఉన్నారు. ఆయనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా సరైనోడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో బన్నీ, బోయపాటి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. బోయపాటితో సినిమా చేయడానికి బన్నీ రెడీనే కానీ.. బన్నీ ఇప్పుడు ఖాళీగా లేడు. అందుచేత ఇప్పుడు బోయపాటితో సినిమా చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నప్పటికీ.. హీరో మాత్రం లేడు. మరి.. ఏ హీరో ముందుకు వస్తారో..? ఎప్పుడు సెట్ అవుతుందో..? చూడాలి.