మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 జులై 2019 (22:24 IST)

బోయ‌పాటి... బాల‌య్య క్యాంప్ నుంచి చిరు క్యాంప్‌లోకి వ‌చ్చారా..?

ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. బాల‌య్య‌తో చేయాల‌నుకున్న సినిమా బ‌డ్జెట్ ఎక్కువ కార‌ణంగా ఆగింద‌ని.. ఖ‌చ్చితంగా బాల‌య్య‌తో బోయ‌పాటి సినిమా ఉంటుంద‌ని ప్రచారం జ‌రిగింది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు త‌ర్వాత బాల‌య్య కె.ఎస్.ర‌వికుమార్‌తో సినిమా ఎనౌన్స్ చేయ‌డంతో.. అస‌లు బాల‌య్య - బోయ‌పాటి సినిమా ఉంటుందా..? ఉండ‌దా..? అనే అనుమానాలు ఏర్ప‌డ్డాయి.
 
దీంతో బోయ‌పాటి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉంటుంది..? ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్‌కి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, బోయ‌పాటి శ్రీను ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... బోయ‌పాటితో గీతా ఆర్ట్స్‌లో సినిమా ఉంటుంద‌ని ఎనౌన్స్ చేసారు. సరైనోడు త‌ర్వాతే గీతా ఆర్ట్స్‌లో బోయ‌పాటి డైరెక్ష‌న్లో చిరంజీవి సినిమా అని ఎనౌన్స్ చేసారు.
 
ప్ర‌స్తుతం మెగాస్టార్ సైరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. అందుచేత ఇప్ప‌ట్లో చిరు డేట్స్ సెట్ కాక‌పోవ‌చ్చు. మ‌రి అలాంట‌ప్పుడు గీతా ఆర్ట్స్‌లో బోయ‌పాటి చేసే సినిమా ఎవ‌రితో ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.