సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:50 IST)

త్రివిక్రమ్, బన్నీ సినిమా.. హీరోయిన్‌గా వింకింగ్ గర్ల్?

ఒక్కసారి కన్ను కొట్టడంతోనే ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అప్పటి నుండి అడపాదడపా వార్తల్లో నిలుస్తూ, పలు ఈవెంట్‌లలో మెరుస్తోంది. చాలా సినీ ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లో "శ్రీదేవి బంగ్లా" అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను స్వంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయింది, ఇది శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉండటంతో దీనిపై వివాదం నడుస్తోంది. 
 
తెలుగులో ఆమె నటించిన "లవర్స్ డే" సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఇది ఇంకా విడుదల కాక ముందే మరో రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఈ భామ. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో రెండో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
 
కనుక ప్రియను మరో హీరోయిన్‌గా తీసుకుంటే ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్‌లను రాబడుతుందని ఆశిస్తున్నారు. మరో ప్రాజెక్ట్‌లో నానితో నటించాల్సి ఉంది. ఇలా కెరీర్ ప్రారంభంలోనే మంచి పేరున్న యంగ్ హీరోలతో జత కడుతున్న ఈ భామ దూకుడు ఎలా ఉంటుందో చూడాలి మరి.