Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

సోమవారం, 4 డిశెంబరు 2017 (15:45 IST)

Widgets Magazine
charmi

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడైన దర్శకుడు పూరి జగన్నాథ్‌తోనే ఛార్మి  కలిసి ఉన్నారు తప్ప ఇంకెవరితోను మాట్లాడటం లేదు. ఎపిలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. దీంతో ఛార్మికి అవకాశాలు ఇవ్వడాన్ని డైరెక్టర్లు మానేశారనే ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారం జరగక ముందు ఛార్మి, జ్యోతిలక్ష్మి, మంత్ర సినిమాల్లో నటించింది. అది కూడా 2015 సంవత్సరంలో. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంతో తెరకెక్కిన్ రోగ్, పైసా వసూల్ సినిమాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
 
కానీ తెరపై మాత్రం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఛార్మి ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే తనతో మంచి సినిమా చేయడమే కాకుండా ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగలిగే డైరెక్టర్ కోసం వెతికిన ఛార్మి, ఇలా చేయగలిగే వ్యక్తి ఒక్క తివిక్రమ్ అన్న అభిప్రాయానికి వచ్చిందిట.
 
అందువల్ల ఇప్పుడు చార్మి ఆయన వెంటపడటం ప్రారంభించిందట. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రివిక్రమ్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ రిక్వెస్ట్‌లను పంపుతోందట. అయితే మాటల మాంత్రికుడు మాత్రం తరువాత మాట్లాడదామని సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. ఐతే చార్మి మాత్రం పట్టువదలకుండా ఛాన్సుల కోసం అడుగుతూనే వున్నదట. మరిత్రివిక్రమ్ ఛార్మికి అవకాశమిస్తారో లేదో చూడాలి..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ ...

news

శ్రీవారి సేవలో చెర్రీ - ఉపాసన... కొణిదెల వారింట శుభవార్త?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ...

news

వార్ సినిమాలో సన్నీలియోన్.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుందట..

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ...

news

క్రేజీ కాంబినేషన్ : మహేష్ - బాలయ్య - బోయపాటిల చిత్రం?

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగా ...

Widgets Magazine