శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (14:23 IST)

ఇవాంకా దెబ్బతో చార్మినార్ దుమ్ముదులిపారు...

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో చార్మినార్ ఒకటి. ఇది హైదరాబాద్ నడిబొడ్డున వెలసివుంది. అయితే, దీని పరిరక్షణపై పాలకులు నామమాత్రంగా శ్రద్ధచూపిస్తూ వచ్చారు. స్థానికులు గగ్గోలు పెట్టినా పెడచెవిన పెట్టే

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో చార్మినార్ ఒకటి. ఇది హైదరాబాద్ నడిబొడ్డున వెలసివుంది. అయితే, దీని పరిరక్షణపై పాలకులు నామమాత్రంగా శ్రద్ధచూపిస్తూ వచ్చారు. స్థానికులు గగ్గోలు పెట్టినా పెడచెవిన పెట్టేవారు. కానీ ఈనెలాఖరులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఫలితంగా చార్మినార్ వద్ద సుందరీకరణపనులు శరవేగంగా సాగుతున్నాయి.
 
చార్మినార్ చుట్టూ పాదచారులు తిరిగే ప్రాంతం అంతా టైల్స్ వేస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న సుందరీకరణ పనులు ముంగిపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌కు వచ్చే ఇవాంకా ట్రంప్ చార్మినార్ లాడ్ బజార్‌లో షాపింగ్ చేయనుంది. దీంతో దీని చుట్టుపక్కల మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
 
ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లోని వెస్ట్‌ఇన్ హోటల్‌లో బస చేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కోసం ఫలక్ నుమా ప్యాలెస్‌కు వెళతారు. మార్గమధ్యలో చార్మినార్‌ను సందర్శించి, ఆ పక్కనే ఉన్న లాడ్ బజార్‌లో షాపింగ్ చేయనున్నారు. దీంతో చార్మినార్ దుమ్ముదులిపారు. 
 
ఫలితంగా నిన్నటివరకు దుమ్మూధూళి, పొగ కమ్మేసి నల్లగా ఉన్న చార్మినార్ కాస్త ఇపుడు తెల్లగా మారిపోయింది. చార్మినార్ పర్యటనలో ఇవాంకా ట్రంప్ వెంట ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉంటారు. దీంతో ఇప్పటి నుంచే చార్మినార్ చుట్టుపక్కల భద్రతను పెంచారు. స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్స్ నిరంతరం నిఘా పెంచాయి.