Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇవాంకా ట్రంప్ రాకతో బిచ్చగాళ్లను కష్టకాలం... ఎక్కడ?

మంగళవారం, 14 నవంబరు 2017 (10:36 IST)

Widgets Magazine
beggar

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28, 29వ తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 28వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇవాంకా వస్తున్నారనీ హైదరాబాద్‌ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చుతున్నారు. ఇందుకోసం బిచ్చగాళ్ళ కోసం హైదరాబాద్ నగర పోలీసులు వలపన్నిమరీ గాలిస్తున్నారు. అంతేనా బిచ్చగాళ్ల ఆచూకీ తెలిపితే రూ.500 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. 
 
ఈ తరహా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇప్పటివరకు 235మంది పురుషులు, 125 మంది మహిళలను చేరదీసి చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ప్రత్యేక శిబిరాలతో పాటు ఆనందాశ్రమాల్లో ఆవాసం కల్పించామన్నారు. గత నెల 20న ప్రారంభించిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో 250 మందిని వారి కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు. 
 
వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వేలిముద్రలు, ఆధార్‌ నంబర్లు సేకరించారు. వారు మళ్లీ భవిష్యత్తులో ఈ వృత్తిలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యాచకుల్లో నైపుణ్యాలను గుర్తించి అవసరమైతే వారికి శిక్షణ ఇచ్చి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోలు బంకులు, ఇతర చోట్ల ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'బాహుబలి' స్టంట్‌కి కేరళ యూత్ యత్నం.. క్షణాల్లో గాల్లో... (వీడియో)

'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌ ఉంది. అచ్చం ఇదే ...

news

భారత్ భద్రతపై నమ్మకం లేదట... ఇవాంక కోసం వైట్‌హౌస్ బలగాలు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఈనెలాఖరులో భారత పర్యటనకు ...

news

మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ : ఓ ఏఎస్ఐ నిర్వాకం

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ ...

news

ఇంకా పెళ్లికాలేదు.. అలాగనీ నేను నపుంసకుడినికాను.. హార్దిక్ పటేల్

గుజరాత్‌ టీవీ చానెళ్లలో పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ...

Widgets Magazine