Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందే.. ఎక్కడ?

సోమవారం, 13 నవంబరు 2017 (15:54 IST)

Widgets Magazine
triple riding

కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో అమ్మాయిలు లేదా మహిళలు వెళుతుంటే మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుంటారు. ఇక నుంచి ఇలాంటివి జాన్తానై అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. 
 
ట్రిపుల్ రైడింగ్‌కి జరిమానాగా వెయ్యి రూపాయలు ఇప్పటివరకు వసూలు చేసేవారు. ఇక నుంచి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. అంటే ట్రిపుల్ రైడింగ్ వెళితే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందేనంటున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. ఈ నిబంధనను త్వరలోనే అమలు చేయనున్నారు. 
 
దీనిపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, ముఖ్యంగా యువతలో మార్పు కోసం ఈ కఠిన నిబంధన అమలు చేస్తున్నామన్నారు. మోటార్ వాహన చట్టం 188 కింద వెయ్యి ఫైన్ వసూలు చేస్తుండగా, యువతలో ఏమాత్రం మార్పు లేదన్నారు. అందుకే ట్రిపుల్ రైడింగ్‌లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలిపారు. 
 
ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ, ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేశారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్త సంవత్సరం నుంచి రైతులందరికీ 24 గంటల కరెంట్ : కేసీఆర్

కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్టు ...

news

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య ...

news

ఆత్మకు శాంతి చేకూరాలని చెపితే సరిపోతుందా? జరిగిన నష్టం పూడ్చలేనిది : పవన్

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని ...

news

క్రిష్ణానది ప్రమాదంపై కన్నీరు పెట్టుకున్న సిఎం బాబు, విలపించిన నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి ...

Widgets Magazine