తన భార్య టాలెంట్ గుర్తించిన దిల్ రాజు, పెన్నూ పేపర్ ఇచ్చారు

dil raju with wife
ఐవీఆర్| Last Modified గురువారం, 3 డిశెంబరు 2020 (16:57 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ చిత్రాలను తీసే స్టార్ ప్రొడ్యూసర్‌గా దిల్ రాజుకు పేరుంది. ఆయన చిత్రాన్ని తీసాడంటే అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయి తీరుతుంది. ప్రేక్షకుల నాడిని ఎలాంటి స్టోరీ కనెక్ట్ అవుతుందో ఎలాంటి పాయింట్‌ను ఇష్టపడతారో దిల్ రాజుకు బాగా తెలుసు. అందుకే ఆయన ఏ చిత్రం తీసినా బ్లాక్‌బస్టర్ అవుతుంది.

అంతేకాదు... ఎవరిలో టాలెంట్ వున్నా దిల్ రాజు వెంటనే గుర్తిస్తారు. వారికి అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్లు, డైరెక్టర్లు, కథా రచయితలుగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మరొకరి టాలెంట్‌ను గుర్తించారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

ఆ వ్యక్తి ఎవరో కాదు... స్వయంగా ఆయన భార్యే. ఆమె కథా రచనలు చేయడంలోనూ, స్టోరీని క్రియేట్ చేయడంలోనూ సూపర్బ్ అని దిల్ రాజు తెలుసుకున్నారట. ఆమె చెప్పిన ఓ లైన్ విని ఆశ్చర్యపోయారట. ఈ లైన్ ఇంప్రూవ్ చేస్తే సూపర్ డూపర్ స్టోరీ అవుతుందని, ఆ పనిని తన టీంకి అప్పగించారట. ఆ లైన్ సక్సెస్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో రైటర్ దొరికినట్లే.దీనిపై మరింత చదవండి :