Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:52 IST)

Widgets Magazine
rajasekhar

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తాజాగా వెల్లడైంది. 
 
హైదరాబాద్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ తన కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. 
 
మరి కారు ప్రమాదానికి గురికావడానికి కారణమేంటని పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాజశేఖర్ తల్లి కొద్ది రోజుల క్రితం మరణించగా, అప్పటినుండి ఆయన చాలా మానసికంగా కుంగిపోయాడు. చనిపోయిన తల్లి మళ్ళీరాదని, ఎన్ని రోజులు ఇలా బాధపడుకుంటూ కూర్చుంటావని కుటుంబసభ్యులు రాజశేఖర్‌కి హితవు పలికే ప్రయత్నం చేశారు. 
 
ఈక్రమంలో మాటమాట పెరిగి కోపంతో బంజారా హిల్స్‌లోని తన ఇంటి నుంచి కారులో బయటకి వచ్చాడు. ఆ టైంలోనే కొన్ని నిద్ర మాత్రలు కూడా వేసుకున్నాడని పోలీసుల సమాచారం. ఇక శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 240 వద్ద కారు ఆపి సిగరెట్ తాగాడని, ఆ తర్వాత రామిరెడ్డి కారుని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం చేశాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ...

news

సమంత మెడలో పసుపుతాడు... ఆ ఆఫర్స్ తన్నుకెళుతున్న హీరోయిన్...

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు ...

news

మెస్మరైజ్ చేస్తున్న 'పద్మావతి' ట్రైలర్

బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి. ఇండియన్ ...

news

హృతిక్ రోషన్‌కు బిటౌన్ మద్దతు.. కంగనా నిలదొక్కుకోగలదని రంగోలి ఫైర్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ ఒంటరిగా నిలిచిపోయింది. హృతిక్ రోషన్ వివాదంతో ...

Widgets Magazine