గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 11 నవంబరు 2021 (22:00 IST)

నేను అదంతా పట్టించుకోను అంటున్న హైపర్ ఆది

మా స్కిట్లు ఏంటో అందరికీ తెలుసు. నాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఎంతో సంతోషిస్తున్నాను. అభిమానుల అభిమానానికి వెలకట్టలేను. అయితే ఒకరు ఎదుగుతుంటే పక్కన వారికి నచ్చదు కదా. తెలిసిందేగా.
 
నా స్కిట్ లోకి చొరబడి నన్ను కొట్టినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేనేదో తప్పు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. నవ్వించడానికి మాత్రమే నేను కొన్ని స్కిట్లు చేస్తున్నాను. సెటైర్లు వేస్తూ ఉంటాను. 
 
అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరినీ బాధించాలనుకోవడం లేదు. నేను వేస్తున్న స్కిట్లు హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే. నన్ను ఎవరూ కొట్టలేదు. దయచేసి అభిమానులు బాధపడకండి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మకండి అంటున్నాడు హైపర్ ఆది.
 
తెలుగు ప్రజలు నన్ను ఇప్పటికే ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని.. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పాడు. అందరిని నవ్వించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నాడు. తనపై దుష్ప్రచారం చేసే వ్యక్తులను తాను పట్టించుకోనంటున్నాడు ఆది.