గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 అక్టోబరు 2021 (22:00 IST)

ఆ బుజ్జి పిల్లా తెల్లపిల్లా ఎక్కడ? అంతా మీ ఇష్టంరా: రెండో పెళ్లిపై మంచు మనోజ్

సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై ప్రచారం జరుగుతోందంటూ ప్రచారం చేయడంపై మంచు మనోజ్ తనదైన స్టైల్లో రియాక్టయ్యారు. నాకు రెండో పెళ్లా, ఇంతకీ పెళ్లి ఎక్కడ? నన్ను కూడా పిలవండి వస్తా. ఆ బుజ్జి పిల్లా తెల్లపిల్లా ఎక్కడ? అంతా మీ ఇష్టంరా, రాసుకోండి అంటూ చురకలు అంటించారు.
 
మంచు మనోజ్ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది. 2015లో మంచు మనోజ్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణత రెడ్డితో మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. ఇక అప్పట్నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఎవరో ఒకరు రాస్తూనే వున్నారు.