శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:55 IST)

డైరెక్టర్ల విషయంలో జాగ్రత్తగా వుంటా... అనుపమా పరమేశ్వరన్

ఈ మధ్య వరుస పరాజయాలతో కుమిలిపోతోంది సినీనటి అనుపమ పరమేశ్వరన్. మొదట్లో కొన్ని హిట్ సినిమాలు వచ్చినా ఆ తరువాత రాను రాను ఫ్లాప్‌లే ఎక్కువయ్యాయి. అయితే ఇక నుంచి మాత్రం కథతో పాటు సినిమాలోని హీరో, తారాగణం నచ్చితేనే సినిమా చేస్తానంటోంది అనుపమ. తాజాగా ఆమె నటించిన హలో గురూ ప్రేమ కోసమే సినిమా విడుదల కాబోతోంది. రామ్ హీరో.
 
కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే నన్ను ఎలా నటింపజేయాలో తెలుసు. అంతేకాదు రామ్ లాంటి హీరో ఎంతో చక్కగా నటిస్తారు. నాకు సలహాలు కూడా ఇస్తారు. డైలాగ్ మర్చిపోయినా.. నా ముఖంలో హావభావాలు సరిగ్గా లేకున్నా వెంటనే చెప్పేస్తారు రామ్. అందుకే అతనితో సినిమాలు చేయాలంటే ఇష్టపడుతుంటాను. 
 
కానీ ఇక నుంచి డైరెక్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేశానంటోంది అనుపమ. అందరూ నాలో ఉన్న ప్రతిభను గుర్తించడం లేదు. నా క్యారెక్టర్‌ను తెరపైన ఏవిధంగా చూపించాలని కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే తెలుసు. అందరికీ తెలియదు. అందుకే ఇక నుంచి సినిమాల విషయంలో జాగ్రత్త పడతాను. ముందుగా డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానంటోంది అనుపమ.