సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (19:01 IST)

భార‌తీయుడు 2లో ఆ ఇద్ద‌రు న‌టిస్తున్నారా..?

క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భార‌తీయుడు. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 రాబోతుంది. భారతీయుడు 2గా రానున్న ఈ చిత్రంలో కమల్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారని స

క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భార‌తీయుడు. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 రాబోతుంది. భారతీయుడు 2గా రానున్న ఈ చిత్రంలో కమల్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆంధ్రప్రేదేశ్‌లోని కడపలో ఒక లొకేషన్స్‌ని ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న త‌ప్పుకున్నారు.
 
ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించనున్నార‌ట‌. ఈ చిత్రాన్ని ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకొనునున్నారని సమాచారం. భార‌తీయుడు వ‌లే భార‌తీయుడు 2 సినిమా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అని టాక్ ఉంది. మ‌రి.. శంక‌ర్ ఈసారి ఏ పాయింట్‌తో సినిమా తీస్తారో..?