మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 8 జులై 2017 (12:16 IST)

'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్‌ చాలా ఎనర్జిటిక్' : జాక్వెలైన్ ఫెర్నాండేజ్

నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రా చాలా ఎనర్జిటిక్ అని బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్ వ్యాఖ్యానించింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా ఈజీగా కలిసిపో

నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రా చాలా ఎనర్జిటిక్ అని బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్ వ్యాఖ్యానించింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా ఈజీగా కలిసిపోతాను. అతడితో నటించడమంటే కష్టమనిపించదు. అతడు చాలా ఎనర్జీతో నటిస్తాడు. అందుకే ఇతర హీరోలతో పోల్చితే సిద్ధార్థ్‌తో ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ చాలా ఈజీగా ఉంటుందని' తెలిపారు.
 
జాక్వెలైన్‌ కామెంట్లపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె చెప్పిన విషయం నిజమేనన్నాడు సిద్ధార్థ్. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో బిజీ షెడ్యూలున్నా తనలాగే జాక్వెలైన్ ఎంతో ఎనర్జీతో పనిచేస్తుందని, కష్టించేతత్వం ఆమె సొంతమన్నారు. మరోవైపు తన ప్రియుడు సిద్ధార్థ్‌తో జాక్వెలైన్ క్లోజ్‌గా ఉండటంపై అలియా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే.