వెబ్ సిరిస్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసం వెయింటింగ్?

Last Updated: శనివారం, 10 నవంబరు 2018 (11:17 IST)
అరవింద సమేత సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. తదుపరి సినిమా పనుల్లో జూనియర్ ఎన్టీఆర్ బిజీ బిజీగా వున్నాడు. తాజాగా ఎన్టీఆర్ వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఇప్పటికే తెలుగులో స్టార్ హీరో రానా వెబ్ సిరిస్‌లోకి వచ్చి విజయం సాధించారు. నాగబాబు కుమార్తె నీహారిక.. ముద్దపప్పు, ఆవకాయ వెబ్ సీరిస్‌తోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ చిన్నా చితకా హీరోలు సైతం ఈ వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టారు. 
 
ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ ప్రపంచంలోకి బిగ్ బాస్ ద్వారా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. వెబ్ సిరీస్ ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ కావొచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ అలీ ఖాన్, మనోజ్ వాజ్ పేయి, మాధవన్ వంటివారు వెబ్ ప్రపంపంలోకి అడుగుపెట్టడం ఎన్టీఆర్‌ని ప్రేరేపించిందట. 
 
అయితే కథ కీలకమని.. డీల్ చేసేందుకు గొప్ప దర్శకుడి కోసం యంగ్ టైగర్ వెయిట్ చేస్తున్నారని టాక్ వస్తోంది. మరి.. ఎన్టీఆర్ వెబ్ సిరీస్‌ వ్యవహారం ఏ దర్శకుడితో ముందుకొస్తుందో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :