శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:53 IST)

కీర్తి సురేష్ పెళ్లి పుకార్లు.. ఆమె ఏం చెప్పిందంటే?

keethi suresh
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు వస్తూనే వున్నాయి. మొదట్లో ఆమె మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌తో ప్రేమలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఆపై ఆమె తల్లిదండ్రులు ఆమెకు మలయాళీ వ్యాపారవేత్తతో వివాహ బంధాన్ని ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. 
 
ఇంకా, తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో ఆమెకు రెండో పెళ్లి జరిగిపోయిందని కూడా కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. ఈ పుకార్లపై కీర్తి సురేష్ స్పందించలేదు. 
 
ఇంకా కీర్తి సురేష్ ప్రశాంతంగా ఉండి పుకార్లపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. అయితే, ఆన్‌లైన్ చాట్ సమయంలో ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడిగినప్పుడు, తనకు తగిన అబ్బాయి దొరకలేదని సరదాగా సమాధానం ఇచ్చింది.