గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (12:04 IST)

పెళ్లికి సిద్ధమవుతున్న కీర్తి సురేష్?

Kirti Suresh
మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తనకు కాబోయే వరుడు గురించి కూడా పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 'మహానటి' అనే సినిమా మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్‌కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. 
 
అంతేకాకుండా ఈ సినిమా వల్ల తక్కువ సమయంలోనే తనకు జాతీయ అవార్డు కూడా అందింది. కానీ మహానటి వల్ల వచ్చిన క్రేజ్‌ను కీర్తి నిలబెట్టుకోలేకపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫామ్ కోల్పోయిన తన కెరీర్‌ను మళ్లీ ఫామ్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న కీర్తిపై పెళ్లి రూమర్స్ అంతటా వైరల్ అయ్యాయి. 
 
కీర్తి.. తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయికి ఓకే చెప్పిందని, త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని సమాచారం. తనకు కాబోయే వరుడు బిజినెస్‌మ్యాన్ మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండే వ్యక్తిగా తెలుస్తోంది. 
 
ఇకపోతే ఇదివరకే కీర్తి సురేశ్‌కు, అనిరుధ్‌కు మధ్య ఇలాంటి రూమర్సే రాగా అవన్నీ అబద్ధం అని కీర్తి కొట్టిపారేసింది. ఇక ఈ పెళ్లి రూమర్స్‌పై తను ఎలా స్పందిస్తుందో చూడాలి.