Widgets Magazine

కీర్తి సురేష్ గురించి అసలు నిజం తెలిస్తే షాకే...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:48 IST)

కీర్తి సురేష్‌.. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిన హీరోయిన్. కానీ ఒకే ఒక్క సినిమా.. మహానటితో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో కీర్తి సురేష్‌ అంటే అందరికీ బాగా తెలుసు. అలనాటి నటి సావిత్రిని అనుకరణ చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 
Keerthy Suresh-Vikram
 
కీర్తి సురేష్‌ చిన్నప్పుడే మూడు సినిమాల్లో నటించింది. మొదటగా మలయాళంలో గీతాంజలి అనే సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం మహానటి మాత్రమే. అయితే ఆమెకు నటన కన్నా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టమట. చెన్నైతో పాటు లండన్‌లలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందట కీర్తి సురేష్‌. ఫ్యాషన్ డిజైనర్‌గానే ఉండాలన్నది ఆమె కోరికట. అయితే ఆ కోరిక నెరవేరకుండా సినిమాలకే పరిమితమైపోయానని బాధపడుతూ చెబుతుందట కీర్తి సురేష్‌.
 
కీర్తి సురేష్‌ అక్క రేవతి సురేష్‌ షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్ధ రెడ్ చిల్లీస్ డిఎఫ్‌‌ఎక్స్‌లో పనిచేస్తున్నారు. తండ్రి సురేష్‌ కుమార్ సినిమా నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి సినీనటి. చిరంజీవితో కలిసి ఈమె కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేష్‌‌కు ఇప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే బాగా ఇష్టమట. అస్సలు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ముఖం మీద చెప్పేస్తుందట కీర్తి సురేష్‌. అయితే ఇప్పుడు మహానటి సినిమాతో మంచి పేరు రావడంతో ఇక చేసేదిలేక సినిమాలకే పరిమితమైపోవాలన్న నిర్ణయానికి వచ్చేసిందట.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అబ్బో... సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నారు బిగ్ బాస్...

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఫైనల్‌కు ఇంకా రెండు వారాలు ...

news

చైతూ పాదాలను ముద్దెట్టుకున్న అనూ.. సమ్మూపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' ...

news

జపాన్‌లో రచ్చ చేస్తున్న 'మగధీర' : థాంక్యూ జపాన్... అంటూ చెర్రీ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మగధీర'. ఈ ...

news

సైరాపై నిషేధం విధిస్తారా? సాహోకు కూడా ఆ దెబ్బ తప్పదా?

మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ...

Widgets Magazine