పవన్ కల్యాణ్‌నే వద్దన్న కైరా అద్వానీ

kiara advani
kiara advani
సెల్వి| Last Updated: శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:19 IST)
అవును పవర్ స్టార్‌తో నటించే ఛాన్సుకు కైరా అద్వానీ నో చెప్పిందట. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేందుకు సై అన్నారు. ఇందులో భాగంగా ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి
‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు.

ఇందులో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. కాగా పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీని తీసుకోవాలనుకున్నారు. కానీ కైరా అద్వానీ ఈ అవకాశాన్ని వద్దని చెప్పిందట. ప్రస్తుతం హిందీలో సూపర్ బిజీగా ఉంది. దీంతో డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దీంతో కైరా పవన్‌కే నో చెప్పేసిందా అంటూ పవర్ ఫ్యాన్స్ నిరాశలోనే కాదు... ఆమెపై గుర్రుగా వున్నారట.దీనిపై మరింత చదవండి :