Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జై లవ కుశ' కంటే 'స్పైడర్'కే భారీ కలెక్షన్లు...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:56 IST)

Widgets Magazine
spyder movie still

గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ ఒకటికాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్. ఈ రెండు చిత్రాలు కేవలం వారం రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 
 
బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్‌టిఆర్ నటించిన సినిమాపై ముందు నుంచీ అభిమానులకు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉందని అభిమానులు భావించారు. ప్రపంచవ్యాప్తంగా 'జై లవ కుశ' భారీగా కలెక్షన్లు సాధించిందని ఆ సినిమా యూనిట్ తెలిసింది.
 
ఆ తర్వాత రిలీజైన్ "స్పైడర్" సినిమా కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. వరుస విజయాల డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్.. మహేష్‌ బాబు నటించిన సినిమా కావడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడం ఖాయమనుకున్నారు. కానీ సినిమా కాస్త యావరేజ్‌గా మారిపోయింది. అయితే కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. "జై లవ కుశ''ను మించేసింది. కేవలం మూడురోజుల్లోనే 'జై లవ కుశ'కు రూ.50 కోట్లు కలెక్షన్లు రాగా 'స్పైడర్' సినిమాకు రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికీ ఈ రెండు సినిమాల్లో 'స్పైడర్'‌కే కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవును! నేను నటిని కాకముందే చాలామందితో డేటింగ్ చేశా: భూమి

బాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో భూమి ఫడ్నేకర్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో చేసింది ...

news

సింగిల్ ఉమెన్‌గా జీవించడం కష్టం.. రేణూ దేశాయ్

జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు ...

news

బాబోయ్... పవన్ కళ్యాణ్‌‌తో ఆ క్యారెక్టర్ చేయనంటే చేయను

పవన్ కళ్యాణ్‌‌తో నటించనని తెగేసి చెబుతోంది నివేదా థామస్. జెంటిల్ మేన్ సినిమాలో నానికి ...

news

బొట్టు పెట్టి ఇదే ఇండియన్ ట్రెడిషన్ అంటోంది... వామ్మో ఏం హాటో(ఫోటోలు)

మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ...

Widgets Magazine