Widgets Magazine

సోషల్‌ మీడియాకు దూరంగా వుండి.. పక్కనున్న వ్యక్తిని ప్రేమించండి.. స్పైడర్ ప్లస్ అండ్ మైనస్

గురువారం, 28 సెప్టెంబరు 2017 (06:43 IST)

spyder movie still

సైన్స్‌ ప్రకారం ప్రతి మనిషిలో వికృత మనస్తత్వం (సైకో) నాలుగు శాతం వుంటుంది. దానివల్లే యజమాని కార్మికుల్ని ఇబ్బందిపెడుతుంటాడు. అధికారులు తన కిందివారిపై పెత్తనం చలాయిస్తుంటారు. భర్త భార్యపై, పిల్లలపై ప్రతాపాన్ని చూపిస్తాడు. అది 15 శాతానికి పెరిగితే సాటి మనుషుల్నే చంపి పైశాచికానందాన్ని అనుభవిస్తుంటాడు. 'గజని'లో చిత్రమైన మతిమరుపు అనే వ్యాధిని హీరోకి ఆపాదించి విలన్‌ను చంపడమనే కాన్సెప్ట్‌తో మైమరిపించిన దర్శకుడు ఎఆర్‌ మురుగదాస్‌.. ఈసారి సైకలాజికల్‌ డిజార్డర్‌లో కొత్త కోణాన్ని విలన్‌లో ఆవిష్కరిస్తూ 'స్పైడర్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో ఎన్‌విఎస్‌ ప్రసాద్‌ తమిళం, తెలుగులో నిర్మించిన ఈ సినిమా నేడే విడుదలైంది. అదెలావుందో చూద్దాం. 
 
నటీనటులు: మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌జె సూర్య భరత్‌, విజయకుమార్‌, నాగినీడు, షిండే తదితరులు
సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, 
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, 
ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, 
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, 
సమర్పణ: ఠాగూర్‌ మధు, 
నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.
 
కథ :
ఇంటలిజెన్స్‌ బ్యూరోలో పని చేసే శివ (మహేష్‌ బాబు) అనధికారికంగా తను కనిపెట్టిన సాప్ట్‌వేర్‌తో పబ్లిక్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేస్తుంటాడు. ప్రమాదం జరగడానికి ముందుగానే వాటిని కనిపెట్టి పరిష్కరించాననే సంతృప్తి పొందుతాడు. అలా ఓ అమ్మాయి చేసిన ఫోన్‌కాల్‌ మలుపు తిప్పుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనింట్లో ఏవో శబ్దాలు వస్తున్నాయంటూ భయపడుతూ స్నేహితురాలికి చేసిన ఆ ఫోన్‌కాల్‌ వివరాలను విన్న శివ, తన స్నేహితురాలైన మహిళా కానిస్టేబుల్‌కు చెప్పి ఆమెకు సహాయంగా ఉండమని కోరతాడు. కానీ, ఆ తెల్లారి ఇద్దరూ అతి దారుణంగా చనిపోయారనే వార్త విని శివ షాక్‌ అవుతాడు. 
 
అత్యంత కిరాతంగా చంపిన ఆ వ్యక్తిని పట్టుకునే క్రమంలో తన తెలివితేటలు వుపయోగించి ఓ వీడియో తీసి.. తన అన్న కోసం వెతుకుతున్నట్లు ఓ అమ్మాయి భైరవ (భరత్‌) ఫొటో చూపిస్తూ ఎవరైనా చూస్తే ఈ ఫోన్‌కు కాల్‌ చేయమనేలా ప్లాన్‌ చేస్తాడు. దాన్ని వాటప్స్‌లో అందరికీ షేర్‌ చేస్తాడు శివ. చివరికి ఓ వ్యక్తి ఫోన్‌చేసి అతను భైరవ కాడని చిన్నతనంలో అతని గురించిన వివరాలు వివరిస్తాడు. వెంటనే శివ ఆ ఊరివెళ్ళి చేసిన పరిశోధనలో కొన్ని భయంకరమైన విషయాలు తెలుసుకుంటాడు. దాంతో అసలు భైరవ (ఎస్‌ జె సూర్య) అని తెలిసి అతన్ని పట్టుకునేందుకు మైండ్‌గేమ్‌ ఆడతాడు. ఆ గేమ్‌ ఎలా వుంటుందనేది మిగిలిన కథ.
 
అభినయం:
ఐబి ఆఫీసర్‌  శివగా మహేష్‌ బాబు ఇమిడిపోయాడు. దారుణంగా హత్యచేసి ఇద్దరు మహిళల్ని చంపిన సన్నివేశంలో హావభావాలు బాగా పండించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు పెద్దగా నటించే అవకాశం లేకపోయినా ఉన్నంతలో మెప్పించింది. తమిళ హీరో భరత్‌ విలన్‌గా ఫరవాలేదనిపించాడు. మనుషుల్ని చంపేసి ఆ శవాల దగ్గర ఏడ్చేవారిని చూసి పైశాచిక ఆనందాన్ని పొందే పాత్రకు ఎస్‌ జె సూర్యను ఎంపికచేసుకోవడంలో మురుగదాస్‌ ప్రతిభ కనబర్చాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 
 
సాంకేతిక వర్గం : 
సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. పతాక సన్నివేశంలో ఆసుపత్రి కూలిపోయే ఎపిసోడ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తోడయి అబ్బురపర్చాయి. పెద్ద  బండరాయి పేలిపోయి దొర్లే సన్నివేశం విజువల్‌ ఎఫెక్ట్‌కు పీటర్‌ హేన్స్‌ యాక్షన్‌ పార్ట్‌ ఆకట్టుకుంటుంది. హరీష్‌ జైరాజ్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలపరంగా వినగానే ఆకట్టుకునేట్లుగా అనిపించలేదు. రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ప్రసాద్‌, మధు కలిసి 150 కోట్లతో నిర్మించామని చెబుతున్న ఈ చిత్రంలో నిర్మాణపు విలువలు తగినట్లుగా వున్నాయి. ఏ ఆర్‌ మురుగదాస్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం నాలుగు విభాగాలకు నేతృత్వం వహించాడు. 
 
విశ్లేషణ:
యాంత్రికజీవితంలో పక్కవాడిని పట్టించుకునే టైమ్‌లేకపోయినా ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, టివి, ల్యాప్‌ టాప్‌లకు అతుక్కుపోయి మానవత్వాన్ని కోల్పోతున్నారు. అవన్నీ కాసేపు మర్చిపోయి మన పక్కనే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండనే సందేశాన్ని దర్శకుడు ఇందులో చెప్పాడు.  అదేవిధంగా  సైన్స్‌ ప్రకారం ప్రతి మనిషిలో వికృత మనస్తత్వం (సైకో) నాలుగు శాతం వుంటుంది. దానివల్లే యజమాని కార్మికుల్ని ఇబ్బందిపెడుతున్నాడు. అధికారులు తన కిందివారిపై పెత్తనం చలాయిస్తుంటారు. భర్త భార్యపై, పిల్లలపై ప్రతాపాన్ని చూపిస్తాడు. అది 15 శాతానికి పెరిగితే సాటి మనుషుల్నే చంపి పైశాచికానందాన్ని అనుభవిస్తున్నాడు. ఇలాంటి వారిని సమాజంనుంచి వెలివేయండనే అంతర్లీనంగా చెబుతూ... అటువంటి వ్యక్తిని చంపినా.. ఆ భావాలున్న వారు ఎందరో వున్నారు జాగ్రత్త! అంటూ హెచ్చరిక జారీ చేశాడు. 
 
ఎదుటివాడు ఏడుస్తుంటే అందులో ఆనందాన్ని అనుభవించే భైరవ అనే సైకో చిన్నతనంలో పెరిగిన వాతావరణం అందుకు కారణమవుతుంది. అంత క్రూరంగా కళ్ళముందు కనకబడకపోయినా అలాంటి భావాలున్నవారు ఎందరో వున్నారని చెప్పాడు. పతాక సన్నివేశంలో ఆసుపత్రిని ఆ సైకో పేల్చేస్తే భూకంపం వచ్చినట్లు బీటలు వాడడం, ప్రాణాలు దక్కించుకునేందుకు చేసే హాహాకారాలు.. హీరో చేసే సాహసోపేత చర్య చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. సమాజంలో ఇలాంటి ఆలోచన గల వ్యక్తులు రకరకాల రూపాల్లో వుండొచ్చు.
 
ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్‌లో పదుల సంఖ్యలో ఓ ఆసుపత్రిలో చిన్నారులకు ఆక్సిజన్‌ అందక చనిపోయిన ఘటనలు వరుసగా జరిగాయి. చాలాకాలం క్రితం చిలకలూరిపేట ప్రయాణిస్తున్న ఓ బస్సును ఓ వ్యక్తి దహనంచేసి ఎంతోమంది ప్రాణాలను తీసేశాడు. అలాగే కొన్ని రైల్వే ప్రమాదాల వెనుక ఇలాంటి సైకో మెంటాలిటీ వున్న ప్రమాదకర వ్యక్తులూ వున్నారు. ఇవన్నీ మన చుట్టూనే జరుగుతున్నా... సగటు మనిషి తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆలోచనతోనే దర్శకుడు మురుగుదాస్‌ 'స్పైడర్‌' ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో టైటిల్‌ను, ట్రైలర్‌లో స్పైడర్‌ను కేవలం ఆసక్తికల్గించడం కోసమే పెట్టాడు మినహా కథకు ఏ మాత్రం సంబంధంలేదు. బాగా పరిశీలిస్తే విలన్‌ దృష్టిలో టైటిల్‌ వున్నట్లుంది. 
 
మహిళలు ధైర్యంలో ఏమాత్రం తీసిపోరని భైరవుడిని కనిపెట్టేందుకు శివ వాడిన సాంకేతికత.. మహిళలు తిలకించే టీవీ సీరియల్‌ను కూడా ట్రాప్‌ చేసి.. వారిచేత విలన్‌ దగ్గర బంధీలుగా వున్నవారిని మహిళలచేత విడిపించడం.. కాస్త లెంగ్తీ అయినా కొత్తగా అనిపిస్తుంది. ఇటువంటి కథను అధునాతన టెక్నాలజీ వుపయోగించుకుని ఎలా మలచవచ్చనే విషయాన్ని స్పష్టం చెప్పాడు. 'మనకు పరిచయం లేనివారికి సాయం చేయడం గొప్పతనం' అనే పాయింట్‌ను దర్శకుడు టచ్‌ చేశాడు. దాన్ని సామాన్యుడు కూడా అందుకునేలా జనరంజకంగా తీసుంటే బాగుండేది.
 
హైలైట్స్‌: 
- సాలెగూడులో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ కోణంలోనే టైటిల్‌ పెట్టినట్లుంది. అది కూడా విలన్‌ కోణంలో వున్నట్లుంది. 
- మానవీయ విలువలున్నాయి. మరుగదాస్‌ తన పరిధిని దాటి వెళ్ళలేదు. 
- మనకు పరిచయం లేనివారికి సాయం చేయడం గొప్పతనం.. అనే పాయింట్‌ను టచ్‌ చేశాడు. 
- హీరో అనగానే పగ, ప్రతీకారం, తనకు తెలిసినవారికో, తన వారికో అన్యాయం జరిగితే ప్రతీకారం తీర్చుకుంటాడు. దానికి భిన్నంగా తన దృష్టికి ఎవరి సమస్యలు వచ్చినా. పరిష్కరించేట్లుగా చర్యలు తీసుకుంటాడు. ఆ పాయింట్‌లో మంచి ప్రయ్నం చేశాడు.. 
 
లోపాలు:
హీరోయిజం సరిగ్గా ఎస్టాబిష్‌ కాలేదు. సీరియస్‌గా తన టార్గెట్‌ను చూసుకునే వ్యక్తి 28రోజులపాటు ఓ అమ్మాయి వెంట పడడం పెద్దగా నప్పలేదు. రకుల్‌ గ్లామర్‌కూ పాటలకే వుపయోగపడింది. 
 
- కొన్ని విజువల్స్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ మాత్రం హాలీవుడ్‌ చిత్రాల్లో చూసినవే. బండరాయి దొర్లడం, ప్రకృతి భీభత్సాలకు కారులు ధ్వంసం కావడం, ఇండిపెండెటన్స్‌ డే, 2012, హాలీవుడ్‌ చిత్రాల్లో చూసినట్లు వుంది మినహా కొత్తగా ఏమీలేదు.
 
ముఖ్యంగా  మురుగదాస్‌నుంచి గ్రాఫిక్స్‌ ఎవరూ అంచనా వేయరు. ఇంకాస్త సెంటిమెంట్‌ పెట్టుకుని మోర్‌ ఎమోషన్స్‌కు వెళితే బాగుండేది. 
 
- సోషల్‌ మీడియాలో దూరంగా వుండి.. పక్కనున్న వాడిని ప్రేమించండి.. అని చెబుతూనే జీవితమంతా కంప్యూటర్‌ సాప్ట్‌వేర్‌తో పనిచేస్తూ ప్రజల ఫోన్లను ట్యాపింక్‌ చేయడం కాస్త విడ్డూరంగానే వుంది. 
 
- నానిలో ఇద్దరూ నటించారు. నేనొక్కడినే.. 1 మైండ్‌గేమ్‌ గుర్తుకువస్తుంది..
 
- ఇక సైకో పాత్ర వెనుక ఎవరైనా వున్నారా! అనే పాయింట్‌ చెప్పకపోవడం. 
 
- కామెడీ అస్సలు లేకపోవడం.
 
సమీక్ష - పెండ్యాల మురళీ


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టీ వీ షో అంటో ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదు: మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టీవీ షోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''స్పైడర్" సినిమా ...

news

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రాకు స్థానం.. క్వాంటికో సీరియల్‌తో..

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటీమణుల జాబితాలో అంతర్జాతీయ స్టార్ ...

news

స్పైడర్ సినిమాపై రోజా ప్రశంసలు.. రాజకీయాల్లోకి రమ్మంటే మహేష్ ఏమన్నారు?

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటోను వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన ...

news

నిర్మాతగా మారనున్న టాలీవుడ్ హీరోయిన్..?

శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా అవకాశాలతో దూసుకెళుతోంది. ...