శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (18:05 IST)

మ‌హేష్‌బాబు 42 ఏళ్ళ కెరీర్ సాక్షిగా ఆన్‌లైన్ బిజినెస్‌లోకి ప్ర‌వేశం!

Maheshbabu carier poster
మ‌హేష్‌బాబు త‌న సినిమా కెరీర్ 42 ఏళ్ళ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను డిజైన్ చేయించారు. నీడ సినిమా నుంచి రేపు విడుద‌ల‌కాబోయే స‌ర్కారివారి పాట ను పెట్టి నంది అవార్ద‌లు, ప‌లు అవార్డుల ఫొటోపెట్టి, చిన్న‌త‌నంతో తన ఫొటో ప‌క్క‌నే ఇప్ప‌టి మ‌హేష్‌బాబు ఫొటోతో చేయించిన‌ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
 
ఒక‌వైపు సినిమాల‌తోపాటు మ‌రోవైపు వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల‌లోనూ ఆయ‌న పాలు పంచుకుంటున్నారు. టెక్స్‌టైల్ రంగం, ఎఎం.బి.మాల్ నిర్మాణంలోనూ వున్న మ‌హేష్‌బాబు నిర్మాత‌గానూ సినిమాలు నిర్మిస్తున్నారు. జి.ఎం.బి. బేన‌ర్‌లో ఇత‌ర హీరోల‌తో సినిమాలు తీస్తున్నారు. 
 
తాజాగా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇ లెర్నింగ్ యాప్‌లోకూడా ప్ర‌వేశించారు. చాలా యాప్‌లున్నా కొన్ని మాత్ర‌మే స‌క్సెస్ అయ్యాయి. అందులో బైజెస్‌.. అనే యాప్‌కు ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ వున్నారు. ఇది ఎడ్యుకేష‌న్ యాప్‌. ఇప్ప‌టికే త‌న కుమార్తె సితార కూడా ఆన్‌లైన్ యాప్ ద్వారా కిడ్స్ ప్రోగ్రామ్‌లు నిర్వ‌హిస్తుంది. 
 
తాజాగా ఓ కొత్త ఎడ్య‌కేష‌న్ యాప్ రంగంలో ఆయ‌న ప్ర‌వేశించ‌బోతున్నారు. ప్రస్తుత ప‌రిస్థితిల్లో ఆన్‌లైన్ ఎడ్య‌కేష‌న్ బాగా పాపుల‌ర్ అయింది. భ‌విష్య‌త్ అంతా దానిదే అని బైజెస్‌..యాప్ ప్ర‌మోష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓ కొత్త ఎడ్య‌కేష‌న్ యాప్ బిజినెస్‌లో ఆయ‌న ప్ర‌వేశించ‌నున్న‌ట్లు తెలిసింది. ఆ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఇది బ‌య‌ట‌కు వ‌స్తే మ‌హేష్‌బాబు పిల్ల‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతార‌న్న‌మాట‌.