మళ్లీ మొదటికే వచ్చిన రజనీకాంత్.. డిసెంబర్ 31 ప్రకటన సంగతేంటి?

శనివారం, 30 డిశెంబరు 2017 (13:25 IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఊరిస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 31వ తేదీ రాజకీయ అరంగేట్రంపై తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్ మళ్లీ మొదటికే వచ్చారు. డిసెంబర్ 31వ తేదీన దేవుడు రాజకీయాల్లోకి తనను రావాలని ఆదేశిస్తే.. అది జరుగుతుందన్నారు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. 
 
తాను నటిస్తున్న తాజా చిత్రాలు '2.0 ', 'కాలా' విడుదల తర్వాత... తన భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని చెప్పారు. చైన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో తన అభిమానులతో ఐదో రోజు సమావేశం సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను సినీ రంగంలోకి రావడానికి తన మిత్రుడు కారణమన్నారు.
 
ఖర్చులకు డబ్బులు కూడా ఉన్నప్పడు అతనే ఇచ్చాడని రజనీకాంత్ తెలిపారు. నిరుపేద స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. తన ఉన్నతికి ఎందరో దర్శకులు కారణమని అన్నారు. తన గురువు బాలచందర్ లేదపోతే రజనీకాంత్ అనేవాడు లేడన్నారు. కొన్ని కారణాల వల్ల '2.0' సినిమా విడుదల ఆలస్యమవుతోందని తెలిపారు. 
 
గతంలో తాను అనారోగ్యానికి గురయ్యానని అభిమానుల ప్రార్థనల వల్లే కోలుకున్నానని చెప్పారు. తనను సూపర్ స్టార్‌గా మార్చడంలో మణిరత్నం, సురేష్ కృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు.దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Balachander Politics Suresh Krissna Mani Ratnam

Loading comments ...

తెలుగు సినిమా

news

కోలీవుడ్ హీరోల సరసన సాయిపల్లవి.. శర్వానంద్‌‌తో ఫిదా హీరోయిన్..

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త ...

news

బాలక్రిష్ణను తండ్రిగా భావిస్తా... నయనతార సంచలన వ్యాఖ్యలు

బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ...

news

అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలుసా?

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ...

news

ధనుష్ సినిమాలో వరలక్ష్మీ.. సాయిపల్లవి హీరోయిన్

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా ...