గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:10 IST)

మన్మథుడు సరసన పాయల్ రాజ్ పుత్.. ఇక దుమ్మురేపేస్తుందా?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. నాగార్జున కెరీర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో మన్మథుడుకు ప్రత్యేక స్థానముంది. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఇందులో నాగార్జున హీరోగా.. సొంత బ్యానర్‌లో సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఛాన్స్ వుంటుందని.. ఇప్పటికే ఇద్దరిలో ఒక కథానాయికగా పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 
 
ఆరెఎక్స్ 100 సినిమాతో పాయల్‌ యూత్‌కి బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో మన్మథుడు2కి ఆమె బాగా యాప్ట్ అవుతుందని సినీ జనం అంటున్నారు. ఇక నాగ్ సరసన నటించే మరో హీరోయిన్ ఎవరనేదానిపై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది.