బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2019 (19:14 IST)

బిగ్ బాస్-3 షోకు అదిరిపోయే అతిథి.. ఎవరు?

బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్-3 షో ముగింపు అతిథులు ఎవరన్న ఆశక్తి అందరిలోను కనిపిస్తోంది. గత రెండు ఎపిసోడ్‌లోను ఇద్దరు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసారి షోకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, అంజలిలు రానున్నట్లు సమాచారం.
 
ఇప్పటికే బాబా భాస్కర్, శివజ్యోతి, వరుణ్ సందేశ్, శ్రీముఖీ, ఆలీలు ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వగా వారిలో శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే వరుణ్, రాహుల్, ఆలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచిన విషయం తెలిసిందే. అయితే వీరిలో విజేతగా నిలిచేవారికి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు.
 
దీంతో గ్రాండ్ ఫినాలే కాస్త ఆశక్తిగా నిలిచింది. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు రాహుల్, వరుణ్ సందేశ్‌లకే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం బాగానే సాగుతోంది. అయితే ఎవరు గెలుస్తారన్నది మరికొన్నిరోజులు ఆగి వేచి చూడాల్సిన పరిస్థితి.