మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 8 నవంబరు 2017 (21:22 IST)

అవకాశమిస్తే చూపిస్తానంటున్న నందిత

ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి టాప్ యంగ్ హీరోయిన్ల సరసన చేరిపోయింది నందిత. ఆ తరువాత మళయాళంలో లండన్ బ్రిడ్జి, తెలుగులో లవర్స్, రాంలీల, క్రిష్ణుడు కలిపింది ఇద్దరిని శంకరాభరణం, సావిత్రి లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింప

ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి టాప్ యంగ్ హీరోయిన్ల సరసన చేరిపోయింది నందిత. ఆ తరువాత మళయాళంలో లండన్ బ్రిడ్జి, తెలుగులో లవర్స్, రాంలీల, క్రిష్ణుడు కలిపింది ఇద్దరిని శంకరాభరణం, సావిత్రి లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత జై లవకుశ సినిమాలో చిన్న రోల్ కూడా చేసింది. అది కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు నందితకు. ఒక్క ప్రేమ కథా చిత్రమే బెస్ట్ ఫిల్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టేలా చేసింది. 
 
కానీ ఆ తరువాత నందితకు అవకాశాలు బాగా తగ్గిపోయింది. ఎన్నోసార్లు తనకున్న పరిచయాలతో యువ హీరోలను, డైరెక్టర్లను కలిసే ప్రయత్నం చేసినా నందితకు అవకాశాలు మాత్రం రాలేదు. అయితే నందిత మాత్రం ఒక్కటే నిర్ణయించుకుంది. చిన్న వయస్సు కావడంతోనే తనకు అవకాశాలు రావడం లేదని, అందులోను మిగిలిన హీరోయిన్ల లాగా ఫిట్నెస్ పెద్దగా లేకపోవడంతోనే డైరెక్టర్లు తనను పక్కకు నెట్టేస్తున్నారని తెలుసుకుంది నందిత. దీన్ని తెలుసుకున్న నందిత ఎలాగైనా ఫిట్నెస్ బాగా సంపాదించాలని గత మూడునెలలుగా జిమ్‌కు వెళ్ళి బాగా స్లిమ్‌గా తయారవుతోందట.
 
హీరోయిన్లు ఎలాంటి స్ట్రక్చర్ చూపిస్తే ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వస్తారో అలాంటి స్ట్రక్చర్ బాగా సిద్ధం చేసిందట. డైరెక్టర్లు తనకు అవకాశామిస్తే తన స్టామినా చూపిస్తానని చెబుతోందట. అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్లు ఈ విధంగా ప్రవర్తిస్తుండటం కొంతమంది సీనియర్ హీరోయిన్లకు అస్సలు నచ్చడం లేదట.